వీకెండ్‌లో భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, అత్యంత కీలకమైన సోమవారం ( Monday) టెస్టులోనూ అద్భుతమైన ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది.టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ధురందర్ 2’ నామస్మరణే వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం…
ఎందుకు ఈ రేంజ్ రెస్పాన్స్?
గతంలో ‘పుష్ప 2’ నెలకొల్పిన నాన్-హాలిడే రికార్డులను సైతం ఈ చిత్రం సవాల్ చేస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు కూడా సోమవారం నాటి వసూళ్లలో కొంత తగ్గుదల కనిపిస్తుంది. కానీ ‘ధురందర్ 2’ విషయంలో సీన్ రివర్స్ అయింది. నిన్నటి సోమవారం వసూళ్లు చూస్తుంటే,ముఖ్యంగా బి, సి సెంటర్లలో మాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటం తో థియేటర్ల వద్ద సందడి నెలకొంది…
మొదటి భాగం కంటే యాక్షన్ మరియు ఎమోషన్ రెట్టింపు అవ్వడం సినిమాకు ప్లస్ పాయింట్.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఇతర పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసి వస్తోంది.పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ విపరీతంగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు.లాంగ్ రన్‌లో ఈ చిత్రం టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ జాబితాలో ఎక్కడ నిలుస్తుందో వేచి చూడాలి.
