76 ఏళ్ళ వయసు.. 16 ఏళ్ళ ఉత్సాహం: చంద్రబాబు ‘రియల్’ సక్సెస్ సీక్రెట్ ఇదేనా..!

చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఒక బ్రాండ్. 76వ ఏట అడుగుపెడుతున్నా ఆయన పనితీరు చూస్తుంటే నేటి యువతకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది.

క్రమశిక్షణ: ఉదయం 5 గంటలకే నిద్రలేవడం, యోగా, మితాహారం.. ఇవే ఆయన ఆరోగ్య రహస్యాలని సన్నిహితులు చెబుతుంటారు.

టెక్నాలజీ విజనరీ: 90ల్లోనే కంప్యూటర్ల గురించి మాట్లాడిన ఆయన, ఇప్పుడు ‘AI’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా పాలనను ఎలా మెరుగుపరచాలో ప్లాన్ చేస్తున్నారు.​

సంక్షోభంలో : ఇటీవల వచ్చిన వరదలు లేదా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు.. ఏవైనా సరే ఆయన డీల్ చేసే విధానం ఒక మేనేజ్‌మెంట్ పాఠం లాంటిది.

అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం

.5లకే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం చంద్రబాబు గారి పుట్టిన రోజు (ఏప్రిల్ 20) సందర్భంగా రూ.76 లక్షలు విరాళంగా అందివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందచేస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే వేరే సంతృప్తి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా ఇంతకన్నా మంచి బహుమానం కూడా ఏమీ ఉండదు.

నారా లోకేష్ ప్రమోషన్: సరిగ్గా పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. లోకేష్ స్వయంగా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ‘నారా’ ప్రభంజనం​ మరోవైపు సోషల్ మీడియాలో #CBN76 మరియు #CBNsirBirthdayCDP హ్యాష్‌ట్యాగ్‌లు హోరెత్తుతున్నాయి. నారా లోకేష్ విడుదల చేసిన స్పెషల్ CDPని అభిమానులు తమ ప్రొఫైల్ పిక్చర్‌లుగా పెట్టుకుంటున్నారు. పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

రాజకీయ నాయకుల పుట్టినరోజు అంటే హంగామా ఉంటుంది. కానీ చంద్రబాబు కుటుంబం మాత్రం దీనిని ఒక సేవా యజ్ఞంలా మార్చేసింది. నారా భువనేశ్వరి గారు రూ. 76 లక్షల విరాళం ఇవ్వడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. “ఒకరి ఆకలి తీర్చడం కన్నా మించిన బహుమతి ఏముంటుంది?” అన్న ఆమె మాటలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

ప్రధాని మోదీ మొదలుకుని మెగాస్టార్ చిరంజీవి వరకు ప్రముఖులందరూ ‘విజనరీ లీడర్’కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు

రక్తదాన శిబిరాలు: విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (మంగళగిరి) మరియు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.

మన నాయకుడి కోసం.. మన రక్తం” అనే నినాదంతో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.​వస్త్ర దానం & పండ్ల వితరణ: పాతబస్తీ, బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ పరిసరాల్లోని నిరుపేదలకు టీడీపీ నేతలు కొత్త వస్త్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేసి చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు.​

భారీ కేక్ కటింగ్స్: బెజవాడ సెంటర్లలో అర్ధరాత్రి నుండే బాణసంచా మోత మోగింది. అభిమానులు 76 కిలోల భారీ కేక్‌లను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

Chandrababu Naidu Birthday, Nara Bhuvaneswari Donation, Anna Canteens Free Food, CBN 76th Birthday, Nara Lokesh CDP, Andhra Pradesh News, Vijayawada TDP News.

Exit mobile version