తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం తిరుమలలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయి, క్యూలైన్లు విస్తరించాయి.
సర్వదర్శనం ; టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 8 నుండి 11 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం Rs. 300 వీరికి సుమారు 3 నుండి 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది.

నడక దారి భక్తులు: దివ్యదర్శనం టోకెన్లు ఉన్న వారికి కూడా రద్దీ కారణంగా 4 -5 గంటల పైనే సమయం పడుతోంది.
టీటీడీ ఏర్పాట్లు:
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా పాలు, తాగునీరు, మరియు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఇబ్బంది పడకుండా గ్యాలరీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కంపార్ట్‌మెంట్లు: అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి క్యూలైన్లు శిలాతోరణం వరకు చేరాయి.
శ్రీవారి ఆదాయం: నిన్న ఒక్కరోజే స్వామివారిని సుమారు 65,000 మందికి పైగా భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం సుమారు రూ. 3.5 కోట్లపైనే వచ్చినట్లు సమాచారం.
ముందస్తు సూచన: రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకుని రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
లడ్డూ ప్రసాదం: రద్దీ ఎక్కువగా ఉన్నందున లడ్డూ కౌంటర్ల వద్ద కూడా భక్తుల క్యూ పెరిగింది. బఫర్ స్టాక్ తగినంతగా అందుబాటులో ఉందని టీటీడీ ..

వసతి గదులు: తిరుమలలో గదులు దొరకడం కష్టంగా మారింది. భక్తులు వీలైనంత వరకు తిరుపతిలో వసతి పొంది, కేవలం దర్శనం కోసమే కొండపైకి రావాలని అధికారులు అన్నారు.
వాతావరణం: మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల క్యూలైన్లలో ఉన్న చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడకుండా టీటీడీ ‘కూల్ పెయింటింగ్’ మార్గాలను ఏర్పాటు చేశారు
TTD News Today TeluguTirumala Darshan Status todayTirumala Crowd Status 2026
Tirumala Rush Today, Tirupati Darshan Waiting Time, Tirumala News Telugu, TTD Sarva Darshan Time, తిరుమల రద్దీ వార్తలు.















