బెల్లం
తీపి మనకు ఉత్సాహాన్నిస్తుంది. జీవితం ఎప్పుడూ చేదుగా ఉండదని, సంతోషకరమైన క్షణాలు కూడా వస్తాయని ఇది గుర్తు చేస్తుంది. ఈ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలని బెల్లం మనకు చెబుతుంది.
వేపపువ్వు
బాధను కూడా ఒక అనుభవంగా స్వీకరించినప్పుడే మనిషి పరిణతి చెందుతాడు.వేపపువ్వు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, జీవితంలో వచ్చే కష్టాలు కూడా మనల్ని దృఢంగా మారుస్తాయి..జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఓటములకు చేదు ప్రతీక
చింతపండు
సమయస్ఫూర్తితో వ్యవహరించడమే పులుపు నేర్పే పాఠం.చింతపండు రసం వంటకు ఎలా రుచినిస్తుందో, మనిషి తన తెలివితేటలతో కష్టాల్లో కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలి.
ఉప్పు
మనల్ని తప్పులు చేయకుండా కాపాడుతుంది కానీ, అతిగా ఉంటే పురోగతిని ఆపేస్తుంది.ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా రుచి పాడవుతుంది. అలాగే జీవితంలో భయం లేదా ఆందోళన కూడా పరిమితిలో వుంటుంది
కారం
కోపాన్ని సరైన మార్గంలో వాడాలే తప్ప, ఎదుటివారిని గాయపరచడానికి కాదని ఇది హెచ్చరిస్తుంది.కారం నాలుకపై మంట పుట్టిస్తుంది, కానీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే కోపం అనేది మనలోని శక్తిని చూపిస్తుంది
మామిడి ముక్కలు
అడుగడుగునా కొత్త విషయాలు నేర్చుకోవాలని, వైవిధ్యాన్ని ఆస్వాదించాలని వగరు మనకు బోధిస్తుంది.పచ్చి మామిడి ముక్క ఇచ్చే వగరు మనకు కొత్తదనాన్ని పరిచయం చేస్తుంది
ఏ ఒక్కటి ఎక్కువైనా, తక్కువైనా జీవితం అసంపూర్ణమే. అన్నింటినీ సమానంగా స్వీకరించడమే జీవతం
ఉగాది పచ్చడిలో ఈ ఆరు రుచులు ఎలాగైతే కలిసిపోయి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయో, మనిషి జీవితం కూడా ఈ ఆరు భావోద్వేగాల కలయికే సంతోషంగా వుందని చూపుతారు















